హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటాడు. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకునే బోగ్లేకు బయట చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
కాగా 61 ఏళ్ల హర్షా బోగ్లే జేమ్స్ అండర్సన్ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా బౌలింగ్ క్యాంప్‌లో జేమ్స్ అండర్సన్ ప్రత్యక్షమయ్యాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లకు బౌలింగ్‌లో టిప్స్ ఇచ్చినట్లు తెలిపాడు.
కానీ రియాలిటీలో అతను జేమ్స్ అండర్సన్ కాదు.. సోహమ్ దేశాయ్. ప్రస్తుతం టీమిండియాకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సైడ్ యాంగిల్‌లో సోహమ్ దేశాయ్ అచ్చం జేమ్స్ అండర్సన్‌ను తలపించాడు. అందుకే బోగ్లే అదేంటి అండర్సన్.. టీమిండియా క్యాంప్‌లో ఏం చేస్తున్నాడని కన్ఫూజన్‌కు గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో నాలుక చరుచుకున్న హర్షా బోగ్లే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
HAHAHAHAHA! Poor Harsha Bhogle really believed Soham Desai to be Jimmy Anderson pola. Tells on air that Anderson came to help out the Indian team before the final 😂 pic.twitter.com/LuMvln3hTF
— Mama | 360° Entertainment (@SriniMaama16) June 7, 2023
చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?'
Comments
Please login to add a commentAdd a comment