
చెన్నై : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోపాటు ఫ్లే ఆఫ్ బెర్త్‌ను కాయం చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత ఇన్నింగ్స్‌తో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కోచ్, కెప్టెన్‌లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్ చేరుకుంటున్న చెన్నై జట్టు విజయ రహస్యం ఏంటని వ్యాఖ్యాత హర్షబోగ్లే ప్రశ్నించగా... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఒకవేళ అందరికీ ఆ రహస్యాన్ని చెబితే.. వచ్చే ఐపీఎల్ వేలంలో చెన్నై యాజమాన్యం తనను కొనుగోలు చేయదన్నాడు. అది వ్యాపార రహస్యమని నవ్వుతూ సమాధానమిచ్చాడు. అయితే, జట్టు విజయాల్లో అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం కీలక పాత్ర పోషిస్తున్నాయన్నాడు. కెమెరాల వెనుక సహాయక బృందం తమ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతానికి ఇంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేనని, రిటైర్ అయ్యాక ఏమైనా ఉంటే చెప్తానన్నాడు.
ఇక షేన్ వాట్సన్‌కు అవకాశం ఇవ్వడంపై స్పందిస్తూ.. గత మ్యాచుల్లో వాట్సన్ రాణించకలేకపోయినా సరే నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూనే ఉన్నాడు. బంతిని అంచనా వేయడంలో వాట్సన్‌కు కచ్చితత్వం ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం అతినికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలా వచ్చిన అవకాశాన్ని వాట్సన్ సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడని ధోని తెలిపాడు. బౌలింగ్‌లోనూ చెన్నై జట్టు బాగా రాణిస్తోండటం మంచి పరిణామమన్నాడు. ప్రపంచకప్ సమీపిస్తున్న సమయంలో తాను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. పస్తుతం తన వెన్ను బాగానే ఉందన్నాడు. ఇక ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment