
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 సమరానికి మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక కీలక పోరుకు ముందు ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే తన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీ20 వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
అతడు ఎంచుకున్న జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి చోటు దక్కింది. కాగా హర్ష భోగ్లే ప్రకటించిన జట్టులో భారత్ నుంచి కోహ్లి ఒక్కడికే ఛాన్స్ లభించింది. ఇక ఈ జట్టులో ఓపెర్లుగా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను భోగ్లే ఎంపిక చేశాడు. అదే విధంగా మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా రన్ మిషన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చోటు దక్కింది.
ఐదో స్థానంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు మైఖల్ హస్సీకు అవకాశమిచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్, పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికు భోగ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఇక తన జట్టులో బౌలర్లగా ఉమర్ గుల్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, శామ్యూల్ బద్రీని భోగ్లే ఎంపికచేశాడు.
హర్ష భోగ్లే ఎంచుకున్న జట్టు: క్రిస్ గేల్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, కెవిన్ పీటర్సన్, మైకేల్ హస్సీ, షేన్ వాట్సన్, షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, శామ్యూల్ బద్రీ
చదవండి: T20 WC 2022: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా! సూపర్-12లో ఐర్లాండ్
Comments
Please login to add a commentAdd a comment