
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ బయోపిక్‌లో మాజీ ఆల్ రౌండర్ కపిల్‌దేవ్ నటిస్తున్నారా? అదేంటి కపిల్ పాత్రలో కదా రణ్‌వీర్ నటిస్తున్నాడు. రణ్‌వీర్ పాత్రలో కపిల్ నటించడమేంటి అనుకుంటున్నారా? బోథమ్ చారిటి కార్యక్రమానికి వెళ్లిన కపిల్ చూసిన వాళ్లంతా ఇదే మాట అంటున్నారు. ఎరుపు రంగు టీ షర్ట్.. నీలం, తెలుపు, ఎరుపు రంగుల గీతలతో ఉన్న బాటమ్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరైయ్యాడు హరియాణా హరికేన్. చిత్రవిచిత్ర డ్రెస్సులతో మెరిసే రణ్‌వీర్‌ను తలపించాడు.
కపిల్ ఫొటోను నటుడు షరీబ్ హష్మి, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విటర్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. రణ్‌వీర్ బయోపిక్‌లో నటించేందుకు కపిల్ సిద్ధమవుతున్నారని చాలా మంది వ్యాఖ్యానించారు. తన బయోపిక్‌లో నటిస్తున్న రణ్‌వీర్‌కు కపిల్ ఈవిధంగా ఫేవర్ చేస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. కపిల్, రణ్‌వీర్ ఒకరికొకరు పరస్పరం తమ పాత్రల్లో నటించనున్నారని చలోక్తులు విసిరారు. కపిల్‌ను ఎప్పుడూ చూడనివిధంగా వెరైటీ డ్రెస్‌లో చూడటం అభిమానులకు కొత్తగా ఉంది.
కపిల్‌దేవ్ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో సారథిగా కపిల్‌దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ మధుర క్షణాలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్ ‘1983’ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టారు. కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు. ఈనెల 6న ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. వివాహం తరవాత తొలిసారి ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు రణ్‌వీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్.
Comments
Please login to add a commentAdd a comment