Super Star Rajinikanth Reaction On 83 Movie: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. నిమా తెరకెక్కించిన చిత్ర బృందానికి, ముఖ్యంగా కపిల్ దేవ్‌ను యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన రణ్‌వీర్ సింగ్‌కు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే 83 సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ చిత్రాన్ని పొగడ్తలతో బౌండరీలు దాటించారు. 'వావ్ వాట్ ఏ మూవీ.. అద్భుతం..' అంటూ ఆకాశానికెత్తారు రజనీ కాంత్. అలాగే నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్. ఈ ట్వీట్‌లో చిత్ర నిర్మాత కబీర్ ఖాన్, కపిల్ దేవ్, హీరో రణ్‌వీర్ సింగ్, నటుడు జీవాను మెన్షన్ చేశారు.
#83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew …
— Rajinikanth (@rajinikanth) December 28, 2021
ఇదీ చదవండి: 1983 వరల్డ్ కప్‌ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment