Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ధోనికి చివరిదని ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడో లేదో తెలీదు కానీ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సీఎస్‌కే ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనికి గిఫ్ట్‌గా అందించాలని భావిస్తోంది.
ఇక మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ధోని రిటైర్మెంట్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్న వేశాడు. చెన్నై వేదికగా ఈ సీజన్‌లో ధోని ఫైనల్ మ్యాచ్(ఐపీఎల్ 2023 ఫైనల్) ఆడబోతున్నాడా అని అడిగాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ''ఏమో ఆడతానో లేదో తెలీదు.. దానికి మరో ఎనిమిది, తొమ్మిది నెలలు సమయం ఉంది. అప్పుడు ఆడాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటా. ఇప్పటినుంచే ఆ తలనొప్పి ఎందుకు? ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. సీఎస్‌కేతో ఉంటా.. జట్టును విడిచివెళ్లను.. అది ఆట రూపంలో కావొచ్చు. లేదా బయటినుంచి మద్దతు అవ్వొచ్చు'' అంటూ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ ప్రదర్శనపై మాట్లాడుతూ..''ఐపీఎల్ చాలా పెద్దది.. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు 8 టాప్ టీంలు ఉండేవి.. ఇప్పుడు పది అయ్యాయి. అయితే ఇదొక ఫైనల్‌గా మాత్రమే తీసుకోము. ఎందుకంటే మేము ఫైనల్లో అడుగుపెట్టడం వెనుక రెండు నెలల కష్టం ఉంది. జట్టు మొత్తం కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే మిడిలార్డర్ కాస్త బలపడాల్సి ఉంది.
గుజరాత్‌టైటాన్స్ ఒక అద్బుత జట్టు.. చేజింగ్‌లో ఒక దశలో మమ్మల్ని భయపెట్టారు. జడ్డూ చక్కగా బౌలింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. కఠినంగా ఉన్న పిచ్‌లపై జడ్డూ బౌలింగ్ శైలి బాగుంటుంది. బౌలర్లందరిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం సపోర్ట్ స్టాప్, బ్రావో , ఎరిక్ లాంటి వ్యక్తులు ఉన్నారు.
ఒక కెప్టెన్‌గా నా జట్టును గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకోసం ఫీల్డర్లను అటు ఇటు మార్చడం నాకున్న అలవాటు. నేను ఫీల్డర్లకు ఎప్పుడు చెప్పేది ఒకటే.. నా దృష్టిని పరిశీలిస్తూ ఫీల్డింగ్ చేయండి. క్యాచ్‌లు మిస్ అయినా పర్లేదు.. పరుగులు రాకూడదు అనేది నా పాలసీ.. ఇక ఆదివారం వరకు ఎదురు చూడాలి.. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ'' అంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment