IPL finals
-
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
'సీఎస్కేను విడిచి వెళ్లను.. మరో 8,9 నెలల్లో నిర్ణయం తీసుకుంటా!'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ధోనికి చివరిదని ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడో లేదో తెలీదు కానీ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సీఎస్కే ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనికి గిఫ్ట్‌గా అందించాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ధోని రిటైర్మెంట్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్న వేశాడు. చెన్నై వేదికగా ఈ సీజన్లో ధోని ఫైనల్ మ్యాచ్(ఐపీఎల్ 2023 ఫైనల్) ఆడబోతున్నాడా అని అడిగాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ''ఏమో ఆడతానో లేదో తెలీదు.. దానికి మరో ఎనిమిది, తొమ్మిది నెలలు సమయం ఉంది. అప్పుడు ఆడాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటా. ఇప్పటినుంచే ఆ తలనొప్పి ఎందుకు? ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. సీఎస్కేతో ఉంటా.. జట్టును విడిచివెళ్లను.. అది ఆట రూపంలో కావొచ్చు. లేదా బయటినుంచి మద్దతు అవ్వొచ్చు'' అంటూ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ ప్రదర్శనపై మాట్లాడుతూ..''ఐపీఎల్ చాలా పెద్దది.. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు 8 టాప్ టీంలు ఉండేవి.. ఇప్పుడు పది అయ్యాయి. అయితే ఇదొక ఫైనల్‌గా మాత్రమే తీసుకోము. ఎందుకంటే మేము ఫైనల్లో అడుగుపెట్టడం వెనుక రెండు నెలల కష్టం ఉంది. జట్టు మొత్తం కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే మిడిలార్డర్ కాస్త బలపడాల్సి ఉంది. గుజరాత్టైటాన్స్ ఒక అద్బుత జట్టు.. చేజింగ్‌లో ఒక దశలో మమ్మల్ని భయపెట్టారు. జడ్డూ చక్కగా బౌలింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. కఠినంగా ఉన్న పిచ్‌లపై జడ్డూ బౌలింగ్ శైలి బాగుంటుంది. బౌలర్లందరిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం సపోర్ట్ స్టాప్, బ్రావో , ఎరిక్ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒక కెప్టెన్‌గా నా జట్టును గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకోసం ఫీల్డర్లను అటు ఇటు మార్చడం నాకున్న అలవాటు. నేను ఫీల్డర్లకు ఎప్పుడు చెప్పేది ఒకటే.. నా దృష్టిని పరిశీలిస్తూ ఫీల్డింగ్ చేయండి. క్యాచ్‌లు మిస్ అయినా పర్లేదు.. పరుగులు రాకూడదు అనేది నా పాలసీ.. ఇక ఆదివారం వరకు ఎదురు చూడాలి.. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ'' అంటూ ముగించాడు. చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరడం పక్కా.. ఆధారాలివిగో అంటున్న ఫ్యాన్స్..!
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో ఓ మ్యాచ్‌కు గ్రీన్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రంగు జెర్సీలు తమ ఆటగాళ్లకు అచ్చి రావట్లేదన్న సెంటిమెంట్‌ను ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ సీజన్‌కు ముందు వరకు ఆర్సీబీ గ్రీన్ జెర్సీల్లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓటమిపాలవ్వగా.. రెండు మ్యాచ్‌ల్లో (2011, 2016) విజయాలు, మరో మ్యాచ్ (2015) వర్షం కారణంగా రద్దైంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలో దిగిన ఆర్సీబీ.. ఆరెంజ్ ఆర్మీని 67 పరుగుల తేడాతో చిత్తు చేసి సీజన్లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఆ జట్టు అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో తమ జట్టు గ్రీన్ కలర్ జెర్సీల్లో గెలిచిన సీజన్లలో ఫైనల్స్‌కు చేరిందని, దీంతో ఈ సీజన్లోనూ డుప్లెసిస్ సేన పక్కాగా ఫైనల్స్‌కు చేరుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది తమ జట్టు పాత ఆనవాయితీకి కూడా చరమగీతం పాడి టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని ధీమాగా ఉన్నారు. కాగా, ఆర్సీబీ తొలిసారి గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలోకి దిగిన 2011 సీజన్లో డేనియల్ వెటోరీ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. అయితే ఫైనల్స్‌లో సీఎస్కే చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 సీజన్లోనూ విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫైనల్స్‌కు చేరినప్పటికీ తుది సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లో కనీసం ఓ మ్యాచ్‌లోనైనా గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో మే 13న పంజాబ్ కింగ్స్‌తో, మే 19న గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. చదవండి: T20 WC 2021: రిజ్వాన్‌కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మే 12న ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఐపీఎల్–2019 తుది పోరుకు చెన్నై వేదిక కానుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో మే 12న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా గత నెల 19న తొలి రెండు వారాల షెడ్యూల్‌ను (17 మ్యాచ్‌లు) మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం అన్ని వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ లీగ్ దశలో మిగిలిన 39 (మొత్తం 56) మ్యాచ్‌ల తేదీలను వెల్లడించింది. దీని ప్రకారం మే 5 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఎప్పటిలాగే ఇంటా, బయటా పద్ధతిలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్లే ఆఫ్ తేదీలను బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... మే 7, 8, 10 తేదీల్లో జరగవచ్చని బీసీసీఐలోని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మ్యాచ్‌ల సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 12వ సీజన్ మొదలవుతుంది. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే... సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఎప్పటిలాగే 7 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్‌రైజర్స్‌తో మిగిలిన ఏడు జట్లు ఈ మ్యాచ్‌లలో తలపడతాయి. -
వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్ స్మిత్
ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టును చివరివరకు విజయం ఊరించింది. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు చేస్తే ఆ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ వరించేది. చేతిలో ఎనిమిది వికెట్లు సైతం ఉన్నాయి. ఈ దశలో పుణె విజయం ఖాయమని అంతా భావించారు. కానీ, చివరివరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె జట్టు ఆశలు అడియాసలయ్యాయి. చివరివరకు క్రీజ్‌లో ఉండి 51 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్నిందించలేకపోయిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ్యాచ్ అనంతరం ఒకింత నిర్వేదంగా మాట్లాడాడు. ఈ పరాజయాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమని చెప్పాడు. అయితే, టోర్నమెంటు మొత్తం తమ ఆటగాళ్లు చక్కని ఆటతీరు ప్రదర్శించడం గర్వంగా ఉందని చెప్పాడు. 129 పరుగులు భారీ లక్ష్యమేమీ కాదని, కానీ ఈ వికెట్ మీద పరుగులు రాబట్టడం కష్టంగా మారిందని, అందువల్లే గెలుపునకు దూరమయ్యామని చెప్పాడు. తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని స్మిత్ అంగీకరించాడు. పరుగులు చేయకుండా తమ బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు నిలువరించారని, అదే మ్యాచ్ గతిని మార్చేసిందని చెప్పాడు. ‘మా చేతిలో వికెట్లు ఉన్నాయి. ఒకటి, రెండు మంచి ఓవర్లు పడితే చాలు మ్యాచ్ మా చేతిలోకి వచ్చేది. కానీ, వాళ్లు (బౌలర్లు) అద్భుతంగా ఆడి.. మమ్మల్ని నిలువరించారు’ అని అన్నాడు. ఐపీఎల్లో ఆడటం చాలా అద్భుతంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్లో ఆడటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని స్మిత్ చెప్పాడు. -
కృనాల్ పాండ్యా అరుదైన ఘనత
హైదరాబాద్: బ్యాట్స్మన్లు అందరూ పెవిలియన్‌కు వరుస కట్టిన తరుణంలో అతడు ఎదురొడ్డినిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొని తన టీమ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విజయంలో కీలకపాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అతడే ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా. ఆదివారం రాత్రి రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కృనాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లలో అతడిదే టాప్ స్కోరు. కృనాల్ సమయోచిత బ్యాటింగ్‌కు తోడు బౌలర్ల ప్రతిభ తోడవడంతో ముంబై ఐపీఎల్-10 విజేతగా నిలిచింది. జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన కృనాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీమిండియాలో చోటుదక్కించుకోకుండా ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు అందుకున్న రెండో ఆటగాడిగా అతడు గుర్తింపు పొందాడు. కృనాల్ కంటే ముందు మన్విందర్ బిస్లా ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నవాళ్లందరూ టీమిండియా తరపున ఆడినవారే కావడం విశేషం. రెండుసార్లు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఐపీఎల్ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు అందుకున్నవారు 2008: యూసఫ్ పఠాన్(రాజస్తాన్ రాయల్స్) 2009: అనిల్ కుంబ్లే(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) 2010: సురేశ్ రైనా(చెన్నై సూపర్‌కింగ్స్) 2011: మురళీ విజయ్(చెన్నై సూపర్‌కింగ్స్) 2012: మన్విందర్ బిస్లా(కోల్‌కతా నైట్‌రైడర్స్) 2013: కీరన్ పొలార్డ్(ముంబై ఇండియన్స్) 2014: మనీశ్ పాండే(కోల్‌కతా నైట్‌రైడర్స్) 2015: రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) 2016: బెన్ కటింగ్(సన్‌రైజర్స్ హైదరాబాద్) -
ధోనీకి మరో చేదు అనుభవం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మహేంద్రసింగ్ ధోనీకి మరోసారి ముంబై చేతిలో చేదు అనుభవమే ఎదురైంది. ఐపీఎల్ ఫైనల్లో మొత్తం నాలుగుసార్లు ముంబై ఇండియన్స్‌ను ధోనీ ఎదుర్కోగా.. వరుసగా మూడుసార్లు ముంబైదే పైచేయి అయింది. 2010, 2013, 2015లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ఫైనల్లో ధోనీ ముంబై జట్టును ఎదుర్కొన్నాడు. 2010లో ముంబైపై విజయం సాధించినప్పటికీ.. 2013, 2015లలో పరాభవాలే ఎదురయ్యాయి. తాజాగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు ఆటగాడిగా ధోనీ మరోసారి ఐపీఎల్ ఫైనల్లో ముంబైతో తలపడ్డాడు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె ఓడించిన ముంబై మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ధోనీ రికార్డు.. అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. మొత్తం ఏడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో (ఆరుసార్లు చెన్నై తరఫున, ఒకసారి పుణె తరఫున) ధోనీ ఆడాడు. అంతేకాకుండా అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులను కోల్పోయిన ప్లేయర్‌గా కూడా అతనే నిలిచాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయముండటంతో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్లను సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడంతో ధోనీ పుణె జట్టుకు మారాడు. ఈ సీజన్లో ధోనీ బ్యాటుతో అంత గొప్పగా రాణించలేకపోయాడు. కానీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబైపై 26 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు ధోనీ మధురమైన విజయాన్ని అందించాడు. అలాగే, హైదరాబాద్ జట్టు 34 బంతుల్లో 61 పరుగులు చేసి లీగ్ దశలో జట్టును గెలిపించాడు. మొత్తానికి ఈ సిరీస్‌లో పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ధోనీ అడపాదడపా తనదైన సత్తాను చాటాడు.