
అజింక్య రహానే.. ప్రస్తుత టీమిండియా జట్టులో కీలక ఆటగాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోపీ గెలిచిన భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒకపక్క జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా సరే... తనలోని పట్టుదలను మాత్రం వదలని రహానే ఉన్న జట్టులోనే తన మాటలతో స్పూర్తి నింపి సిరీస్ గెలవడంలో ప్రముఖపాత్ర పోషించి చరిత్ర సృష్టించాడు.కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డపై నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించినందుకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందాయి. స్వదేశానికి వచ్చాక తాను నివసిస్తున్న ప్రాంతంలో అతనికి రెడ్ కార్పెట్ పరిచి ఘనస్వాగతం పలికారు.
అయితే సిరీస్ విజయం తర్వాత రహానే ఎన్నో సందర్భాల్లో గెస్టర్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కంగారు బొమ్మ ఉన్న కేక్ మాత్రం రహానే కట్ చేయలేదు. అది ఎందుకు చేయలనేది తాజాగా రహానే రివీల్ చేశాడు. ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా బోగ్లేతో జరిగిన చిట్‌చాట్‌లో పాల్గొన్న రహానే దానివెనుక ఉన్న కారణం వివరించాడు. రహానే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం'
'కంగారూ అనేది ఆస్ట్రేలియా జాతీయ జంతువు.. దేశమేదైనా సరే వారి గౌరవాన్ని కించపరచడం కరెక్ట్ కాదు. ఒక దేశంపై గెలిచామా.. చరిత్ర సృష్టించామా అన్నది ముఖ్యం కాదు.. ప్రత్యర్థి దేశాన్ని ఎంత గౌరవించామా అనేది ప్రధానంగా చూడాలి. అందుకే కంగారు బొమ్మ ఉన్న కేక్‌ను కట్ చేయలేదు అని వివరించాడు. కాగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకు చేరుకొని ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. చదవండి: 'స్వదేశానికి వచ్చాక అస్సలు టైం దొరకలేదు'
Comments
Please login to add a commentAdd a comment