హర్ష బోగ్లేతో ధోని (PC: IPL/BCCI)
IPL 2023 CSK Vs SRH- Dhoni- Harsha Bhogle: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్‌ను ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి కీలక వికెట్‌లో భాగస్వామ్యమయ్యాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి కామెంటేటర్ హర్షా బోగ్లే ప్రస్తావించగా వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ద్రవిడ్ సైతం ఇలాగే
అలాంటి క్యాచ్‌లు అందుకోవడం అంత సులువేమీ కాదు కదా అని హర్ష పేర్కొనగా.. ‘‘నిజానికి అప్పుడు నేను సరైన పొజిషన్‌లో లేను. మేము గ్లౌవ్స్ వేసుకుంటాం కాబట్టి.. కొంతమందికి మేము తేలికగానే క్యాచ్ పట్టేస్తామని అనిపిస్తుంది.
ఈ రోజు నేను అద్భుతమైన క్యాచ్ అందుకున్నాను. కొన్నిసార్లు మన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా.. అనుకోకుండా ఇలా జరిగిపోతుంది. నాకింకా గుర్తే.. ఓ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సైతం ఇలాంటి క్యాచ్‌నే అందుకున్నాడు’’ అని ధోని పేర్కొన్నాడు.
నువ్వేమీ ముసలోడివి కాలేదు
అదే విధంగా.. ‘‘వయసు పైబడుతున్న కొద్దీ.. అనుభవం కూడా పెరుగుతుంది. సచిన్ టెండుల్కర్‌లా 16-17 ఏళ్లకే క్రికెట్ ఆడటం మొదలుపెడితే విషయం వేరేలా ఉంటుంది. ఆటను మరింతగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది’’ అని ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో హర్షా స్పందిస్తూ.. ‘‘నీకేమీ వయసు మీదపడలేదు(నువ్వేమీ ముసలోడికి కాలేదింకా)’’ అని సరదాగా కామెంట్ చేశాడు
వయసు పైబడింది.. నేనేమీ సిగ్గుపడను
దీంతో.. ‘‘లేదు లేదు! కచ్చితంగా నాకు వయసు పైబడుతోంది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడను’’ అంటూ 41 ఏళ్ల ధోని అంతే ఫన్నీగా బదులిచ్చాడు. ఇక అద్భుతమైన క్యాచ్ పట్టినా తనకు అవార్డు ఇవ్వలేదంటూ ఐపీఎల్ నిర్వాహకులను ఉద్దేశించి ధోని సరదాగా కామెంట్ చేశాడు.
రుతుకు అవార్డు.. నాకు మాత్రం ఇవ్వలేదు
కాగా చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో రైజర్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధోని సంచలన క్యాచ్ అందుకోవడంతో పాటు.. మయాంక్ అగర్వాల్‌ను స్టంపౌట్, వాషింగ్టన్ సుందర్‌ను రనౌట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో యాక్టివ్ క్యాచ్ అవార్డును చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. తీక్షణ బౌలింగ్‌లో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ అద్భుత రీతిలో అందుకుని అవార్డు గెలుచుకున్నాడు.
చదవండి: Dhoni: నాకూ కూతురు ఉంది.. మరి అక్క ఏది? తంబీ లేడా?.. తప్పు చేశావు కుట్టీ!
CSK VS SRH: ఎట్టకేలకు 28 మ్యాచ్‌ల తర్వాత రిపీటైంది..!
In his own style, @msdhoni describes yet another successful day behind the stumps 👏
— IndianPremierLeague (@IPL) April 21, 2023
And along with it, shares a special Rahul Dravid story and admiration for @sachin_rt 😃#TATAIPL | #CSKvSRH pic.twitter.com/4gL8zU9o9v
Comments
Please login to add a commentAdd a comment