IPL 2022 Mega Auction: Harsha Bhogle Picks Two Players Who May Fetch High Price - Sakshi
Sakshi News home page

Harsha Bhogle: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!

Published Sat, Jan 29 2022 4:11 PM | Last Updated on Sat, Jan 29 2022 6:12 PM

Harsha Bhogle Picks Two Players Who May Fetch High Price In IPL 2022 Mega Auction - Sakshi

Two Players Who May Fetch High Price In IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ జట్టు ఏ ఆటగాడికి ఎంత వెచ్చించి కొనుగోలు చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో క్రికెట్‌ విశ్లేషకులు, మాజీలు వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంపై తమతమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఇదే విషయమై ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా బోగ్లే సైతం తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడు. 

వేలంలో అత్యధిక ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లు వీరే నంటూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా ఆక్షన్‌లో టీమిండియా యువ వికెట్‌కీపర్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌, అలాగే తమిళనాడు పవర్‌ హిట్టర్‌, పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ప్లేయర్‌ షారుక్‌ ఖాన్‌లు రికార్డు ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లుగా నిలుస్తారని జోస్యం చెప్పాడు. ఈ ఇద్దరి కోసం మొత్తం 10 ఐపీఎల్‌ జట్లు ఎగబడతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అందులోనూ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ కావడం ఇషాన్‌ కిషన్‌కు అదనంగా కలిసొచ్చే అంశమని.. లోయర్‌ ఆర్డర్‌లో పవర్‌ఫుల్‌ హిట్టర్‌ కావడమే షారుక్‌ ఖాన్‌కు ప్లస్‌ పాయింట్‌ అని.. ఈ కారణాల చేతనే ఈ ఇద్దరు భారత ఆటగాళ్లకు జాక్‌పాట్‌ ధర లభిస్తుందని హర్షా బోగ్లే అంచనా వేశాడు. ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ను టీమిండియా మాజీ హిట్టర్‌ యూసఫ్‌ పఠాన్‌తో పోల్చాడు. షారుక్‌ కూడా యూసఫ్‌ పఠాన్‌ లాగే భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఒంటి చేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని కొనియాడాడు. 

వేలంలో షారుక్‌ ఖాన్‌కు 10 నుంచి 13 కోట్లు, ఇషాన్‌ కిషన్‌.. 10 నుంచి 17 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. కాగా, గతంలో ఇషాన్‌ కిషన్‌(6.5 కోట్లు)ను ముంబై, షారుక్‌ ఖాన్‌(5.25 కోట్లు)ను పంజాబ్‌ కింగ్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇషాన్‌.. గతేడాది ఐపీఎల్‌ల్లో 10 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలతో 241 పరుగులతో పర్వాలేదనిపించగా, షారుక్‌.. 11 మ్యాచ్‌ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. 
చదవండి: IPL 2022: అతను కెప్టెన్‌ కాలేడు.. అయినా భారీ ధర పలకడం ఖాయం..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement