ఐపీఎల్ మెగా వేలం 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సీఎస్‌కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమితంగా ఆరాధించే సొంత అభిమానుల చేతనే చివాట్లు తినే స్థాయికి సీఎస్‌కేను దిగజార్చింది. కొందరు తమిళ తంబిలైతే ఏకంగా సీఎస్‌కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్విటర్‌లో #Boycott_ChennaiSuperKings పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు.
#Boycott_ChennaiSuperKings pic.twitter.com/KkHw7T9OUb
— மேட்டூர் தினேஷ் (@NTK_DINESH) February 14, 2022
తమిళులకు తీరని అన్యాయం చేసిన లంకేయులను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్ధులుగా పంపిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టులోకి ఎలా తీసుకుంటారని సీఎస్‌కే యాజయాన్యంపై ఫైరవుతున్నారు. లంక క్రికెటర్ తీక్షణను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని లేదంటే సీఎస్‌కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. సీఎస్‌కేకు మరపురాని విజయాలందించిన సురేశ్ రైనా లాంటి ఆటగాడిని కాదని సింహల ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీక్షణను వెంటనే తొలగించి సురేశ్ రైనాను జట్టులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#Boycott_ChennaiSuperKings pic.twitter.com/LGS61z4s74
— Narasimha Midde (@narasimhamvnr) February 14, 2022
చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..!
Comments
Please login to add a commentAdd a comment