స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భారత్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంకేయులు తమ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించారు. ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
ముఖ్యంగా లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. మూడు వన్డేల్లో కలిపి ఆతిథ్య జట్టు స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. తొలి రెండు వన్డేల్లో కాస్త పర్వాలేదన్పంచిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో అన్నీ బ్యాటింగ్ పిచ్‌లే ఉంటాయని, తమ దేశంలో అలా ఉండవని తీక్షణ తెలిపాడు.
"భారత్‌లో దాదాపుగా అన్ని పిచ్‌లు ప్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి వికెట్‌పై భారత బ్యాటర్లు బాగా అలవాటు పడి ఉంటారు. అందుకే ఇక్కడ(శ్రీలంక)కు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు.
కొలంబోలోని ప్రేమదాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాము. కొంచెం టర్న్ ఉంటే చాలు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నందున ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు.
దేశీవాళీ క్రికెట్‌లో కూడా మాకు ఇటువంటి పిచ్‌లే ఉంటాయి. కాబట్టి మా బ్యాటర్లకు ఇటువంటి వికెట్లపై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.
చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
Comments
Please login to add a commentAdd a comment