
శ్రీలంక క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యాడు

చిరకాల ప్రేయసి ఆర్తిక యొనాలితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు

ఈ సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో మహీశ్- ఆర్తిక ఫొటోలు షేర్ చేసింది

కాగా ఆర్తిక క్యాబిన్ క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం

ఇక గతేడాది వరకు సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించిన మహీశ్.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు

మెగా వేలంలో మహీశ్‌ను రాజస్తాన్ రూ. 4. 40 కోట్లకు కొనుగోలు చేసింది











