Asia Cup 2022- Sri Lanka vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్‌కు శ్రీలంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. 11 మంది అన్నదమ్ములు జట్టులో ఉన్నపుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అక్కర్లేదంటూ ఖలీద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా గ్రూప్- బిలో ఉన్న శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య గురువారం కీలక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
సూపర్-4కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక.. బంగ్లాదేశ్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దసున్ షనక బృందం టోర్నీలో మరో ముందడుగు వేయగా.. బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. బంగ్లాదేశ్‌పై సులువుగానే విజయం సాధిస్తామంటూ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్‌కు ముందు మాటల యుద్ధం
బంగ్లాదేశ్ పసికూన అన్న ఉద్దేశంలో.. వాళ్ల జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నాడని వ్యాఖ్యానించాడు. బంగ్లా కంటే అఫ్గనిస్తాన్ బలమైన జట్టుగా కనిపిస్తోందని లంక కెప్టెన్ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన.. బంగ్లాదేశ్ డైరెక్టర్ ఖలీద్.. ‘‘దసున్ మమ్మల్ని ఎందుకు అంత తేలికగా తీసిపారేసాడో అర్థం కావడం లేదు.
అఫ్గనిస్తాన్ టీ20 జట్టు గొప్పగా ఉండొచ్చు. అందుకే అలా అన్నాడేమో! అయితే, మాకు కనీసం ఇద్దరైనా ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారు. కానీ శ్రీలంక జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ బౌలర్ కూడా లేడు కదా’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో స్వీయ తప్పిదాలతో బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించగా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంక జయకేతనం ఎగురవేసింది.
ట్వీట్‌తో తాజాగా యువ బౌలర్!
ఈ నేపథ్యంలో మహీశ్ తీక్షణ ట్విటర్ వేదికగా ఈ మేరకు ఖలీద్‌కు రీకౌంటర్ వేశాడు. మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో సమిష్టిగా రాణిస్తే సరిపోతుందని, తమ సహోదరులతో కలిసి ఈ లాంఛనం పూర్తిచేశామన్న ఉద్దేశంలో 22 ఏళ్ల మహీశ్ ట్వీట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రూపంలో కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్
T20 WC 2022- England Squad: ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అతడికి మొండిచేయి!
No need to have world class players, when you have 11 brothers ❤️ pic.twitter.com/H0rYESlF6i
— Maheesh Theekshana (@maheesht61) September 2, 2022
Comments
Please login to add a commentAdd a comment