ఇబాదత్‌ హొస్సేన్ అరుదైన ఫీట్‌.. తొలి బంగ్లాదేశ్‌ పేసర్‌గా! చెత్త ప్రదర్శన కూడా! | Ebadot Hossain Become A first Bangladesh pacer to take three wickets on T20I debut | Sakshi
Sakshi News home page

SL Vs Ban: ఇబాదత్‌ హొస్సేన్ అరుదైన ఫీట్‌.. తొలి బంగ్లాదేశ్‌ పేసర్‌గా! చెత్త ప్రదర్శన కూడా!

Published Fri, Sep 2 2022 11:31 AM | Last Updated on Fri, Sep 2 2022 11:55 AM

Ebadot Hossain Become A first Bangladesh pacer to take three wickets on T20I debut - Sakshi

బంగ్లాదేశ్ యువ పేసర్ ఇబాదత్‌ హొస్సేన్ తన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు.  టీ20 క్రికెట్‌లో అరంగేట్ర మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్‌ పేస్‌ బౌలర్‌గా ఇబాదత్‌ హొస్సేన్ రికార్డులకెక్కాడు.

ఇక ఈ మ్యాచ్‌లో  ఇబాదత్‌ మూడు వికెట్టు సాధించినప్పటికీ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ.. అఖరి రెండు ఓవర్లలో మాత్రం పూర్తిగా  తేలిపోయాడు.

చివరి 2 ఓవర్లలో శ్రీలంక విజయానికి 25 పరుగులు కావల్సిన నేపథ్యంలో 19వ ఓవర్‌ వేసిన ఇబాదత్‌ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. ఇక అఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమవ్వగా.. శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. కాగా శ్రీలంక సూపర్‌-4కు ఆర్హత సాధించగా.. బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టింది.
చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్‌! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్‌ అల్‌ హసన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement