శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ముగిసిన ఆఖరి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య లంకపై గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 563/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాక్ 134 ఓవర్లలో 576/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ రిజ్వాన్ (50 నాటౌట్; 4 ఫోర్లు, 1సిక్స్) అర్ధసెంచరీ పూర్తికాగానే డిక్లేర్ చేసింది. ఆగా సల్మాన్ (132 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలి చాడు. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 67.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కరుణరత్నే (41; 6 ఫోర్లు) రాణించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ (7/70) చావుదెబ్బ తీశాడు. నసీమ్ షాకు 3 వికెట్లు దక్కాయి.
పాకిస్తాన్ అరుదైన ఘనత..
ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. శ్రీలంక గడ్డపై పాకిస్తాన్‌కు ఇది ఐదో టెస్ట్ సిరీస్ విజయం. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ రికార్డులకెక్కింది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు శ్రీలంకలో నాలుగు టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్నాయి . తాజా సిరీస్ విజయంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను పాక్ అధిగమించింది. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్ధానంలో ఉంది.
చదవండి: IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment