ఆసియా కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఆసియా కప్‌లో చాలా మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో టాస్ మరోసారి కీలకం కానుంది.
ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను ఓడించిన లంక మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఆడనుంది. ఆసియా కప్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు.
డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే!
మరోవైపు పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బ్యాటింగ్‌లో మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవరూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. అయితే పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉండడం సానుకూలాంశం.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్
Comments
Please login to add a commentAdd a comment