Pak Vs SL 1st T20I: Spinner Makes History For Pakistan Women Stunning Spell T20I Debut - Sakshi
Sakshi News home page

PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్‌లో పాక్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

Published Wed, May 25 2022 5:20 PM | Last Updated on Wed, May 25 2022 9:27 PM

Spinner Makes History For Pakistan Women Stunning Spell T20I Debut - Sakshi

పాకిస్తాన్‌ మహిళా లెగ్‌ స్పిన్నర్‌ తుబా హసన్‌ టి20 క్రికెట్‌లో కొత్త చరిత్ర చరిత్ర సృష్టించింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే బౌలింగ్‌లో బెస్ట్‌ స్పెల్‌(4-1-8-3) నమోదు చేసిన పాకిస్తాన్‌ మహిళా బౌలర్‌గా అరుదైన ఫీట్‌ సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో తుబా హసన్‌ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి ఒక మెయిడెన్‌ సహా మూడు కీలక వికెట్లు తీసుకొని ఆకట్టుకుంది. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన తుబా హసన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''ఇంత అద్బుతమైన స్పెల్‌ ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదు.. సూపర్‌ బౌలింగ్‌ తుబా హసన్‌..'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. మాదవి, నిలాక్షి డిసిల్వా చెరో 25 పరుగులు చేశారు. తుబా హసన్‌, అనమ్‌ అమిన్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. ఐమన్‌ అన్వర్‌ రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ మహిళల జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. నిదా దార్‌ 36* పరుగులు, బిస్బా మరూఫ్‌ 28* పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాకిస్తాన్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ మే 26న జరగనుంది.

చదవండి:  కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది

BAN Vs SL: బంగ్లాదేశ్‌ 365 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement