ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ తమ తుది జట్టును ప్రకటించింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హరీస్ రౌఫ్, నసీం షాలు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. వీరిలో నసీం షా టోర్నీ మొత్తానికే దూరం కాగా.. రౌఫ్ గాయంపై స్పష్టత రావాల్సి ఉంది. నసీం షా స్థానంలో జమాన్ ఖాన్ తుది జట్టులోకి రాగా.. హరీస్ రౌఫ్ ప్లేస్‌లో మొహమ్మద్ వసీం జూనియర్ జట్టులో చేరాడు. ఈ రెండు మార్పులతో పాటు పాక్ మరో మూడు మార్పులు కూడా చేసింది.
భారత్‌తో మ్యాచ్ సందర్భంగానే గాయపడిన అఘా సల్మాన్ స్థానంలో సౌద్ షకీల్ జట్టులోకి రాగా.. ఓపెనర్ ఫకర్ జమాన్ స్థానంలో (రెస్ట్) మొహమ్మద్ హరీస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఫహీమ్ అష్రాఫ్‌పై (10-0-74-0) వేటు పడింది. అతడి స్థానంలో మొహహ్మద్ నవాజ్ తుది జట్టులోకి వచ్చాడు. మొత్తంగా రేపటి మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఏకంగా ఐదు మార్పులు చేసింది.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.
శ్రీలంకతో మ్యాచ్‌కు పాకిస్తాన్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హాక్, మొహమ్మద్ హరీస్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్
Comments
Please login to add a commentAdd a comment