
Asia Cup 2022 Winner Sri Lanka: ఆసియాకప్-2022 ఛాంపియన్స్‌గా శ్రీలంక అవతరించింది. ఈ మెగా ఈవెంట్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా టైటిల్‌ను ఎగరసేకిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో చిత్తు చేసి 6 వసారి ఆసియాకప్ విజేతగా లంక నిలిచింది.
కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాక గ్రౌండ్‌లో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ శ్రీలంక జెండా పట్టుకోని సంబురాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ జెండా పట్టుకోని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. కాగా గంభీర్ ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత, ఆఫ్గనిస్తాన్ అభిమానులు లంకేయుల విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్రీలంకకు అభినందనలు తెలుపుతూ.. మరోవైపు పాకిస్తాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ సూపర్-4 దశలోనే భారత్, ఆఫ్గనిస్తాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe
— Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022
చదవండి: Asia Cup 2022 Final: అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment