PAK Vs SL 1st Test: Pakistan Pacer Hasan Ali Hilarious Dance Video Viral - Sakshi
Sakshi News home page

Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్‌ బౌలర్‌

Published Sun, Jul 17 2022 6:21 PM | Last Updated on Mon, Jul 18 2022 11:30 AM

Hasan Ali Hilarious Dance Video Viral PAK vs SL 1st Test Galle - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హసన్‌ అలీ అంతుపట్టని డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్‌ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్‌ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న హసన్‌ అలీ.. మ్యాచ్‌కు దూరంగా ఉన్న హారిస్‌ రౌఫ్‌తో మాట్లాడుతూ కనిపించాడు.

ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఇచ్చాడు. అయితే హసన్‌ అలీ చేసిన డ్యాన్స్‌ కాస్త విచిత్రమైన మూమెంట్స్‌లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్‌ డానిసన్‌ మోరిసన్‌ ఈ అంతుపట్టని డ్యాన్స్‌ ఏంటా అని షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌లో హసన్‌ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. బాబర్‌ ఆజం వీరోచిత సెంచరీ పాక్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్‌ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్‌ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్‌ చేయాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement