Galle
-
147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..!
శ్రీలంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు. జూలై 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తాను ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లలో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ చేయగా.. టాపార్డర్ తేలిపోయింది. దిముత్ కరుణరత్నె(2), పాతుమ్ నిసాంక(27), దినేశ్ చండిమాల్(30) నిరాశపరిచారు.కమిందు మెండిస్ సంచలన శతకంఏంజెలో మాథ్యూస్(36), కుశాల్ మెండిస్(50) రాణించగా.. కమిందు మెండిస్ శతకంతో చెలరేగాడు. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. తద్వారా కమిందు మెండిస్ సౌద్ షకీల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెరీర్లో వరుసగా తొలి ఏడు టెస్టుల్లో యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తొలుత ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ కమిందుకే ఈ ఘనత సాధ్యమైంది. ఈ క్రమంలో అతడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్‌ను కూడా అధిగమించాడు. గావస్కర్, సయీమ్ అహ్మద్(పాకిస్తాన్), బసిల్ బుచర్(వెస్టిండీస్), బర్ట్ సచ్లిఫ్(న్యూజిలాండ్) తమ తొలి ఆరు టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించారు.ఐదు వికెట్లతో చెలరేగిన రూర్కీఇక కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు సాధించింది. కమిందు, కుశాల్ మెండిస్ (68 బంతుల్లో 50; 7 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఇతర ప్లేయర్లలో దినేశ్ చండీమల్ (30), ఏంజెలో మాథ్యూస్ (36), పాథుమ్ నిసాంక (27) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.ఇక రెండో రోజు ఆటలో టెయిలెండర్లు రమేశ్ మెండిస్(14), ప్రబాత్ జయసూర్య(0), అసిత ఫెర్నాండో(0) పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా 91.5 ఓవర్లలో శ్రీలంక 305 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో రూర్కీ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ టామ్ లాథమ్ ఒకటి, అజాజ్ పటేల్ , గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు కూల్చారు. కమిందు మళ్లీ మెరిసేనా?ఇక గురువారం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కాగా కమిందు మెండిస్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు పూర్తి చేసుకుని 695 పరుగులు సాధించాడు. ఏడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఈ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు బాదాలని పట్టుదలగా ఉన్నాడు.చదవండి: చెత్త షాట్ సెలక్షన్!.. కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్ -
అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ అంతుపట్టని డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హసన్ అలీ.. మ్యాచ్‌కు దూరంగా ఉన్న హారిస్ రౌఫ్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. అయితే హసన్ అలీ చేసిన డ్యాన్స్ కాస్త విచిత్రమైన మూమెంట్స్లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ ఈ అంతుపట్టని డ్యాన్స్ ఏంటా అని షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం వీరోచిత సెంచరీ పాక్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు. Hassan Ali's back!!!! pic.twitter.com/WoQjdftQmQ — Ramiya 2.0 (@yehtuhogaaa) July 16, 2022 చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్ చేయాలి' -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గాలె స్టేడియాన్ని కూల్చుతున్నారు!
గాలె: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్లో వచ్చిన సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్‌ఫోర్ట్‌ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ వల్ల కోట గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా, స్టేడియంలో నిర్మించిన 500 సీట్ల సామర్థ్యం కలిగిన పెవిలియన్ స్టాండ్ వల్ల వారసత్వ జాబితాలో చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్ని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి విజయదాస రాజపక్సే పార్లమెంట్లో వెల్లడించారు. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో గాలెలోనే మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. గాలె పిచ్ స్పిన్‌కు అనుకూలం. 1998 తరువాత గాలె వేదికగా జరిగిన చాలా మ్యాచ్‌ల్లో శ్రీలంక ఘన విజయాలు సాధించింది. శ్రీలంక జట్టుకు అదృష్ట స్టేడియంగా చెప్పొచ్చు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 'కోటకు ఉన్న వారసత్వ సంపద గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. క్రికెట్ మైదానానికి మరో ప్రత్యమ్నాయం చూడాలి' అని క్రీడా శాఖ మంత్రి ఫైజర్ ముస్తఫా చెప్పాడు. ఈ క్రమంలోనే నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ గాలె స్టేడియం వేదికగా జరిగే చివరి మ్యాచ్ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కోహ్లీసేన ప్రతీకార విజయం
రెండేళ్ల క్రితం ఇదే వేదికపై శ్రీలంక చేతిలో ఎదురైన దారుణ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. లంకతో జరిగిన తొలిటెస్టులో విరాట్ కోహ్లీ సేన 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 550 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, షమీ, ఉమేశ్ లకు ఒక్కో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అంతకుముందు 188/3 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 53 ఓవర్లలో 240 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహానే(23 నాటౌట్) క్రీజులో ఉండగా కెప్టెన్ కోహ్లీ తమ రెండో ఇన్నింగ్స్ ను 240/3 వద్ద డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్ గా భారత్ కు 550 పరుగుల ఆధిక్యం లభించింది. కరుణరత్నే పోరాటం వృథా భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 29 పరుగులకే ఓపెనర్ తరంగ(10), గుణతిలక(2) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ కరుణరత్నే (208 బంతుల్లో 97; 9 ఫోర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. కీపర్ డిక్ వెల్లా(67), కుశాల్ మెండిస్ (36) పరవాలేదనిపించారు. ఓటమి అంతరాన్ని తగ్గించడానికి లంక ఎంతో శ్రమించినా భారత బౌలర్ల సమిష్టి రాణింపుతో 245 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రెండేళ్ల కింద గాలే టెస్టులో ఓటమికి కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
కొహ్లీ సెంచరీ
గాలే: శ్రీలంక-భారత్‌ల మధ్య జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ శతక్కొట్టాడు. 133 బంతుల్లో కొహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక లక్ష్యం 550 పరుగులు అయింది. అంతకుముందు 188/3 పరగుల వద్ద నాలుగో రోజు ఆటను భారత్ ప్రారంభించింది. నాలుగో రోజు 40 బంతులను ఎదుర్కొన్న భారత బ్యాట్స్మన్లు విరాట్ కొహ్లీ103(136), అజింక్య రహానే 23(18)లు 51 పరుగులు జోడించారు. దీంతో శ్రీలంక ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించగలిగింది. -
స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం
ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాణించడంతో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో స్టెయిన్ విజృంభించి 99 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో గాలే టెస్ట్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. స్టెయిన్ కు మార్కెల్ అండగా నిలిచి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో తొలిసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హషీం ఆమ్లా చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో అత్యధికంగా సంగక్కర 76, సిల్వా 38 పరుగులు తప్పా.. మిగితా ఆటగాళ్లెవరూ పెద్గగా రాణించలేకపోవడంతో 216 పరుగులకు శ్రీలంక ఆటౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సొంతం చేసుకున్న స్టెయిన్ రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. మార్కెల్ 4, డ్యుమినీ 2 వికెట్లు పడగొట్టారు. స్కోర్లు: తొలి ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 455, శ్రీలంక: 292 రెండవ ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 206, రెండవ ఇన్నింగ్స్ 216