శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా గతేడాది నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది.. శ్రీలంక సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
16 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. అతడు చివరగా టెస్టుల్లో గతేడాది జూలైలో శ్రీలంకపై ఆడాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు ముహమ్మద్ హురైరా,అమీర్ జమాల్‌కు తొలి సారి పాకిస్తాన్ టెస్టు జట్టులో చోటుదక్కింది. శ్రీలంక సిరీస్‌తో వీరిద్దిరూ రెడ్‌బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2023-25లో భాగంగా జరగనుంది. కానీ సిరీస్ జూలైలో జరగనుంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. బాబర్ ఆజాం నేతృత్వంలోని పాక్ జట్టు జులై 9న శ్రీలంకకు పయనం కానున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు జూలై 3న కరాచీలో పాకిస్తాన్ జట్టు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో టెస్టులకు పాకిస్తాన్ జట్టు: బాబర్ అజాం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హురైరా, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది,షాన్ మసూద్.
Comments
Please login to add a commentAdd a comment