ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ పేసర్ల ధాటికి వణికిపోతుంది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో భారత టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది. తొలుత షాహీన్ అఫ్రిది భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టగా.. తర్వాత హరీస్ రౌఫ్ టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
SHAHEEN SHAH AFRIDI! Rohit Sharma is clean bowled 🎯#ShaheenShahAfridi #INDvsPAK #INDvPAK #PAKvIND #AsiaCup23 #AsiaCup #RohitSharma pic.twitter.com/MNBGY2ywza
— Haqeeq Ahmed (@eyemHaqeeq) September 2, 2023
అఫ్రిది.. ఐదో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మను (11), ఏడో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లి (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. హరీస్ రౌఫ్.. 10వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్‌ను (14), 15వ ఓవర్ తొలి బంతికి శుభ్‌మన్ గిల్‌ను (10) ఔట్ చేశాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి టాప్-4 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా టాప్-3 బ్యాటర్లు అఫ్రిది, రౌఫ్‌ల చేతుల్లో క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.
Shaheen Afridi has Rohit Sharma AND Virat Kohli. Castles them both. There is absolutely no doubt about it. Best in the WORLD! 🔥🔥🔥 #PAKvIND #INDvsPAK #AsiaCup #AsiaCup23 #ShaheenAfridi #ViratKohli #RohitSharma pic.twitter.com/wk4YUVCoig
— King Babar Azam Army (@kingbabararmy) September 2, 2023
శ్రేయస్ అయ్యర్ (14).. రౌఫ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/4గా ఉంది. ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (7) క్రీజ్‌లో ఉన్నారు. అఫ్రిది 5 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. రౌఫ్ 5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు.
Haris Rauf claims his first wicket and India loses three wickets inside 50 runs.
— CricTracker (@Cricketracker) September 2, 2023
📸: Disney + Hotstar pic.twitter.com/KJbPCSt0QD
147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD
— CricTracker (@Cricketracker) September 2, 2023
Shreyas Iyer's bat broken on Haris Rauf's delivery. pic.twitter.com/CWs68vOGgC
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2023
Comments
Please login to add a commentAdd a comment