IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. | IPL 2025: Sunrisers hyderabad vs Lucknow super giants Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి..

Published Thu, Mar 27 2025 6:57 PM | Last Updated on Thu, Mar 27 2025 11:06 PM

IPL 2025: Sunrisers hyderabad vs Lucknow super giants Live Updates And Highlights

 SRH vs LSG Live Updates And Highlights: ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.

ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి..
ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ల‌క్నో ఘ‌న విజ‌యం సాధించింది. 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ల‌క్నో కేవ‌లం 16.1 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 52 ప‌రుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జంపా, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ష‌మీ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేకపోయారు. భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

విజ‌యానికి చేరువ‌లో లక్నో
ల‌క్నో తొలి విజ‌యానికి చేరువైంది. 30 బంతుల్లో 15 ప‌రుగులు కావాలి. క్రీజులో స‌మ‌ద్‌(11), మిల్ల‌ర్‌(8) ఉన్నారు.

వ‌రుస‌గా రెండు వికెట్లు డౌన్‌..
ల‌క్నో వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. 13వ ఓవ‌ర్ వేసిన జంపా బౌలింగ్‌లో బ‌దోని ఔట్ కాగా.. 15 ఓవ‌ర్‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో పంత్ ఔట‌య్యాడు.

ల‌క్నో మూడో వికెట్ డౌన్‌..
మార్ష్ రూపంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. 52 ప‌రుగులు చేసిన మార్ష్‌.. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి ఆయూష్ బ‌దోని వ‌చ్చాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎల్ఎస్‌జీ 3 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది.

రెండో వికెట్ డౌన్‌.. పూర‌న్ ఔట్‌
120 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 70 ప‌రుగులు చేసిన పూర‌న్‌.. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 10 ఓవ‌ర్ల‌కు ఎల్ఎస్‌జీ రెండు వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది.క్రీజులో మార్ష్‌(44),పంత్‌(2) ఉన్నారు.

నికోలస్‌ పూరన్‌ విధ్వసం..
నికోల‌స్ పూర‌న్ విధ్వ‌సం సృష్టిస్తున్నాడు. కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పూరన్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67)  తన బ్యాటింగ్‌ను తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో పూరన్‌తో పాటు మార్ష్‌(32) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న మార్ష్,పూర‌న్‌..
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో నికోల‌స్ పూర‌న్‌(44), మిచెల్ మార్ష్‌(25) ఉన్నారు. వీరిద్ద‌రూ దూకుడుగా ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో..
191 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ఐడైన్ మార్‌క్ర‌మ్‌..మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నికోల‌స్ పూర‌న్ వ‌చ్చాడు.

నాలుగేసిన శార్థూల్‌.. ఎస్ఆర్‌హెచ్ స్కోరంతంటే?
ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ప‌ర్వాలేద‌న్పించారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్లు అద్బుతంగా రాణించారు.

 బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. ల‌క్నో పేస‌ర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగాడు. అత‌డితో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, దిగ్వేష్‌, ర‌వి బిష్ణోయ్‌, ప్రిన్స్ యాద‌వ్ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్‌(47) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. అనికేత్ వ‌ర్మ‌(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్‌(26) రాణించారు.

ఎనిమిది వికెట్ డౌన్.. క‌మ్మిన్స్ ఔట్‌
ప్యాట్ క‌మ్మిన్స్(4 బంతుల్లో 18) రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్‌ స్కోర్‌: 180/8
ఎస్ఆర్‌హెచ్ ఆరో వికెట్ డౌన్‌.. అనికేత్ ఔట్‌
అనికేత్ వర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 36 ప‌రుగుల‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనికేత్‌.. దిగ్వేష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్‌ స్కోర్‌: 169/7

ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్‌.. నితీశ్ రెడ్డి ఔట్‌
నితీశ్ కుమార్(32) రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్డ‌య్యాడు.

ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌.. క్లాసెన్ ఔట్‌
హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌.. దురుదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి(30), అంకిత్ వర్మ(7) పరుగులతో ఉన్నారు.

ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 47 ప‌రుగులు చేసిన హెడ్‌.. ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి హెన్రిచ్ క్లాసెన్ వ‌చ్చాడు.
7 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 71/2
7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెండు వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(47), నితీశ్ కుమార్ రెడ్డి(15) ఉన్నారు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్ శ‌ర్మ ఔట్ కాగా.. రెండో బంతికి ఇషాన్ కిష‌న్ ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ రెండు వికెట్ల న‌ష్టానికి 27 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర‌లేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

తుది జ‌ట్లు
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్ధార్థ్, ఆకాష్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement