కొనసాగుతున్న గిల్‌ వైఫల్యాల పరంపర.. ఏకి పారేస్తున్న అభిమానులు | Asia Cup 2023 IND VS PAK: Fans Slam Shubman Gill For His Continuous Failure | Sakshi
Sakshi News home page

Asia Cup 2023 IND VS PAK: కొనసాగుతున్న గిల్‌ వైఫల్యాల పరంపర.. ఏకి పారేస్తున్న ఫ్యాన్స్‌ 

Published Sat, Sep 2 2023 6:16 PM | Last Updated on Sat, Sep 2 2023 7:25 PM

Asia Cup 2023 IND VS PAK: Fans Slam Shubman Gill For His Continuous Failure - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా యంగ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. గతకొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో  అభిమానులకు విసుగు తెప్పిస్తున్న గిల్‌.. తాజాగా పాక్‌తో జరుగుతున్న కీలక సమరంలో మరోసారి ఘోరంగా విఫలమై, భారత అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నెటిజన్లు గిల్‌ను ఏకి పారేస్తున్నారు. గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

గిల్‌ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడని, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అతనికి అంత సీన్‌ లేదని విమర్శిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో గత 17 ఇన్నింగ్స్‌ల్లో (20, 0, 37, 13, 18, 6, 10, 29, 7, 34, 85, 3, 7, 6, 77, 9, 10 (పాక్‌తో మ్యాచ్‌లో)) అతను కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే చేశాడని, ఈ మాత్రం దానికి అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం ఎందుకుని  సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. గిల్‌ను తప్పిస్తే తుది జట్టు కూర్పు కూడా సెట్‌ అవుతుందని.. రోహిత్‌కు జతగా ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపవచ్చని అంటున్నారు. 

పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్‌ బ్యాటింగ్‌ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని, అతను పాక్‌ పేసర్లను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా నేటి మ్యాచ్‌లో నసీం షాను ఎదుర్కొనేందుకు గిల్‌ చాలా బయపడ్డాడని, ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించిందని కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, గిల్‌ పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్‌ పాక్‌ పేసర్లు సంధించిన బంతులను ఎదుర్కోలేక  చేతులెత్తేశాడు. 

ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతుంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్‌ కిషన్‌ (54), హార్ధిక్‌ పాండ్యా (37) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 29 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 147/4గా ఉంది. రోహిత్‌ శర్మ (11), విరాట్‌ కోహ్లి (4)లను అఫ్రిది క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (14), శుభ్‌మన్‌ గిల్‌లను (10) హరీస్‌ రౌఫ్‌ పెవిలియన్‌కు పంపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement