స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుకు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్ 2024లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో అతడి మెకాలికి గాయమైంది. డాల్ఫిన్స్ ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు.
దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్‌కు దూరమయ్యాడు.
గతేడాది కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. షాహీన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లే ఆఫ్స్‌కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.
ఇంగ్లండ్‌తో సిరీస్ సమయానికి అఫ్రిది ఫిట్‌నెస్ సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించనుంది. ఆక్టోబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment