ఆసియా కప్ 2023 ప్రారంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ముల్తాన్ చేరుకున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ప్రస్తుతం ఆలూరు బెంగళూరు సమీపంలోని ఆలూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ టోర్నీ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 29న శ్రీలంక పయనం కానుంది.
టీమిండియా మాస్టర్ ప్లాన్..
కాగా గత కొంతకాలంగా ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు బ్యాటర్లు లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌లకు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పేసర్ మహ్మద్ అమీర్.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. 2021 T20 ప్రపంచ కప్‌లో షాహీన్ అఫ్రిది వంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు టీమిండియా బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు.
అయితే ఆసియాకప్‌లో షాహీన్ అఫ్రిది వంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా మాస్టర్ ప్లాన్ వేసింది. ట్రైనింగ్ క్యాంప్‌లో కర్ణాటకకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అంకిత్ చౌదరి బౌలింగ్‌ను భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాటర్లు అంకిత్ చౌదరి బౌలింగ్‌ను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కేఎల్ రాహుల్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఆసియాకప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్.
Comments
Please login to add a commentAdd a comment