ప్రపంచక్రికెట్‌లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. కాబట్టి దాయుదుల పోరు ఎప్పుడుంటుందాని అభిమానులు అతృతగా ఎదురుచూస్తుంటారు.
అయితే ఇరు దేశాల అభిమానులకు మాత్రం ఈ ఏడాది పండగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం నెలల వ్యవధిలోనే పాక్-భారత జట్లు రెండు సార్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలుత శ్రీలంక వేదికగా జరగనున్న ఆసియాకప్-2023లో దాయాదుల సమరం జరగనుండగా.. ఆ తర్వాత భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో తాడోపేడో తెల్చుకున్నాయి.
వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతుంటాయి. సాధారణంగా దాయాదుల పోరు అంటే ఇరు జట్లపై కూడా తీవ్ర ఒత్తడి ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు రెండు దేశాల ప్రతిష్టత. కానీ పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది భిన్నంగా స్పందించాడు. భారత్‌తో మ్యాచ్‌పై మేము ఎక్కువగా దృష్టి సారించడం లేదని షాహీన్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
"మేము భారత్‌తో మ్యాచ్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అది మాకు ముఖ్యం కాదు. వరల్డ్‌కప్‌ను ఎలా గెలవాలన్న గురించి ఆలోచిస్తాం, దానిపై దృష్టి సారిస్తాం" అని ఓ లోకల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. కాగా మోకాలి గాయం కారణంగా గత కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న అఫ్రిది.. ఇటీవలే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో బీజీబీజీగా ఉన్నాడు.
చదవండి: Mohammad Shami: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక
Comments
Please login to add a commentAdd a comment