Asia Cup 2023- India vs Pakistan: Pakistan Reveal Playing XI: ఆసియా కప్-2023లో టీమిండియాతో మ్యాచ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడిన టీమ్‌నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. కాగా ఈ వన్డే ఈవెంట్లో సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం.. 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
పసికూనపై ప్రతాపం
పసికూన నేపాల్‌పై ప్రతాపం చూపి ప్రస్తుతం గ్రూప్-ఏలో ముందంజలో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) పూర్తిగా విఫలమైనప్పటికీ పటిష్ట టీమిండియాతో పోరులో ఇద్దరినీ కొనసాగించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది.
ఆఫ్రిది సంగతేంటి?
అదే విధంగా కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించింది. షాహిన్, నసీం షా, హ్యారిస్ రవూఫ్ రూపంలో పేస్ త్రయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
దంచికొట్టిన బాబర్, అహ్మద్
కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 151 పరుగులతో చెలరేగగా..రిజ్వాన్ 45 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికర్ అహ్మద్ అజేయ సెంచరీ(109)తో మెరవడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.
పాక్ బౌలర్ల విజృంభణతో కుదేలు
లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఆఫ్రిది, నసీం షా, రవూఫ్‌లో ఆరంభంలో వికెట్లు తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆఫ్రిది 2, నసీం షా ఒకటి, హ్యారిస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీయగా.. షాదాబ్ 4 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. శ్రీలంకలోని క్యాండీ చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం దాయాదుల పోరుకు వేదిక కానుంది. ఇక పాకిస్తాన్ తమ తుది జట్టును ప్రకటించగా.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో అనే చర్చలు మొదలయ్యాయి.
టీమిండియాతో మ్యాచ్‌కు పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.
చదవండి: బుమ్రా కాదు! బాబర్‌కు చుక్కలు చూపించగల భారత బౌలర్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment