బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రావల్పండి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పాక్ భావిస్తోంది.
ఈ క్రమంలో రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడా ప్రిలిమనరీ జట్టును పాకిస్తాన్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది దూరమయ్యాడు. ఇటీవలే అఫ్రిది భార్య అన్షూ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి పాక్ జట్టు మెనెజ్‌మెంట్ పితృత్వ సెలవు మంజారు చేసింది.
ఇక అతడి స్ధానంలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఈ 12 మంది సభ్యుల జట్టులో పేసర్ మీర్ హమ్జాకు కూడా చోటు దక్కింది. అయితే మీర్ హమ్జా బెంచ్‌కే పరిమిత మయ్యే అవకాశముంది. అర్బర్ ఆహ్మద్‌కు ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లే.
ఎందుకంటే తొలి టెస్టులో చేసిన తప్పిదాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేయకూడదని పాక్ భావిస్తోంది. మొదటి టెస్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్తాన్ బరిలోకి దిగింది. అందుకు ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్‌కోచ్ గిల్లెస్పీ మరోసారి అటువంటి ఘోర తప్పిదం చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
"రావల్పిండి పిచ్ పరిస్థితులపై మా అంచనా ఆధారంగా 12 మంది సభ్యుల జట్టులో అబ్రార్ అహ్మద్‌కు చోటు ఇచ్చాము. అయితే మేము ఆడాల్సిన వికెట్‌ను ఇంకా పరిశీలించలేదని" గిల్లెస్పీ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడ.
బంగ్లాతో రెండో టెస్టుకు పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, మహమ్మద్ అలీ, మీర్ హమ్జా
Comments
Please login to add a commentAdd a comment