బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బతీసినందుకే అతడిని జట్టు నుంచి తప్పించారనే వదంతులు వస్తున్నాయి. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి అనంతరం.. షాన్ మసూద్- షాహిన్ ఆఫ్రిది మధ్య సఖ్యత లోపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
కొట్టుకునే దాకావెళ్లిన ఆటగాళ్లు
షాహిన్ భుజంపై మసూద్ చేయి వేయగా.. అతడు విసురుగా తీసివేసిన దృశ్యాలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకావెళ్లగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్ ఆఫ్రిది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఘోర పరాజయం నేపథ్యంలో
కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు... టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసింది.
ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా... లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది.
కోచ్ చెప్పిందిదే
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ మాట్లాడుతూ.. షాహీన్ షా భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ విరామం అతడికి ఉపయోగ పడుతుందనిఅన్నాడు. ‘షాహిన్‌తో చర్చించాం. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అత్యుత్తమ కూర్పుతో బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గెలెస్పీ పేర్కొన్నాడు. అయితే, సహచర ఆటగాళ్ల పట్ల షాహిన్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.
చదవండి: లక్షల కోట్లకు వారసుడు.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
Comments
Please login to add a commentAdd a comment