![Shaheen Afridi, wife blessed with baby boy amid PAK vs BAN series](/styles/webp/s3/article_images/2024/08/24/sahen.jpg.webp?itok=W2j4bfHa)
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్రయ్యాడు. అతడి భార్య అన్షా శనివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు అలీ యార్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అఫ్రిది కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోషల్ మీడియా వేదికగా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహీద్ అఫ్రిది కుమార్తే.
రెండో టెస్టుకు దూరం..?
కాగా షాహీన్ అఫ్రిది ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తరపున ఆడుతున్నాడు. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కరాచీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment