Pakistan Cricket Team: పాకిస్తాన్ హై పర్ఫామెన్స్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్‌బర్న్.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్‌కోచ్‌గా నియమించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
తన మార్కు చూపిస్తున్న హఫీజ్
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్ సిబ్బంది ఫోర్ట్‌పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్‌బర్న్ హై పర్ఫామెన్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ యాసిర్ అరాఫత్‌ను నియమించాడు.
పాక్‌తో ప్రయాణం ముగిసిపోయింది
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ టీ20 సిరీస్ నుంచి యాసిర్ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్‌బర్న్ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు.
పాకిస్తాన్ క్రికెట్‌తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఎక్స్ వేదికగా నోట్ షేర్ చేశాడు. అతడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గాన్ హెడ్‌కోచ్‌గా నియమితుడైనట్లు సమాచారం.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ నియమితుడయ్యాడు.
Bohat Bohat Shukriya 🇵🇰 pic.twitter.com/n0k0pagdtb
— Grant Bradburn (@Beagleboy172) January 7, 2024
Comments
Please login to add a commentAdd a comment