అఫ్గన్ చేతిలో ఓడిన పాక్ జట్టు (ఫైల్ ఫొటో)
Pakistan Vs New Zealand T20, ODI Series 2023: సొంతగడ్డపై.. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. స్వదేశంలో ఏప్రిల్ 14 నుంచి మే 7 వరకు కివీస్‌తో ఐదు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
మోకాలి గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ షా ఆఫ్రిది ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక కెప్టెన్‌గా బాబర్ ఆజం తిరిగి బాధ్యతలు చేపట్టనుండగా.. షాదాబ్ ఖాన్ అతడికి డిప్యూటీగా వ్యవహరించున్నాడు.
అఫ్గన్ చేతిలో అవమానకర ఓటమి తర్వాత
కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్ వంటి కీలక ప్లేయర్లు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఖాన్ బృందం ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది.
పాకిస్తాన్‌పై తొలిసారి టీ20 సిరీస్(2-1) గెలిచిన అఫ్గన్ జట్టుగా నిలిచింది. ఇక షాదాబ్ ఖాన్ సారథ్యంలో ఈ అవమానకర ఓటమి తర్వాత పటిష్ట న్యూజిలాండ్‌తో వరుస సిరీస్‌లకు ఈ స్టార్లంతా తిరిగిరావడం పాక్‌కు కలిసివచ్చే అంశం. ఇదిలా ఉంటే ఐపీఎల్-2023లో గుజరాత్ తరఫున ఆడిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడగా.. పాక్‌తో సిరీస్‌కు టామ్ లాథమ్ సారథిగా వ్యవహరించున్నాడు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజం(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫాహీమ్ ఆష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇహ్‌సానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, నసీం షా, సయీమ్ ఆయుబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, జమాన్ ఖాన్.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పాక్ టీమ్:
బాబర్ ఆజం(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హారిస్ సొహైల్, ఇహ్‌సానుల్లా, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, ఉసామా మిర్.
చదవండి: అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment