ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రెండో బంతికే రోహిత్ శర్మ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌ను అందుకునేందుకు ఫకర్ జమాన్ విఫలయత్నం చేశాడు. అది కాస్త బౌండరీగా వెళ్లింది.
అనంతరం షాహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్లో రోహిత్ అద్భుతమైన బౌండరీ బాది జోష్‌గా కనిపించాడు. అయితే ఐదో ఓవర్‌లో అఫ్రిది.. సూపర్ డెలివరితో రోహిత్‌ను (11, 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ చేసి, రెండు బౌండరీలకు ప్రతీకారం తీర్చుకున్నాడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కూడా రోహిత్ అఫ్రిది బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. నాటి మ్యాచ్‌లో అఫ్రిది రోహిత్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు.
SHAHEEN SHAH AFRIDI! Rohit Sharma is clean bowled 🎯#ShaheenShahAfridi #INDvsPAK #INDvPAK #PAKvIND #AsiaCup23 #AsiaCup #RohitSharma pic.twitter.com/MNBGY2ywza
— Haqeeq Ahmed (@eyemHaqeeq) September 2, 2023
కోహ్లి కూడా..
అద్భుతమైన బంతితో రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అఫ్రిది.. తన నాలుగో ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ ఓవర్) మరో వికెట్ పడగొట్టాడు. ఈ సారి కోహ్లి అఫ్రిది ధాటికి బలయ్యాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్రిదిని ఓ ఆట ఆడుకున్న కోహ్లి ఈసారి మాత్రం అతని నుంచి తప్పించుకోలేకపోయాడు. కోహ్లి ఔట్ కావడంతో టీమిండియా 27 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Shaheen Afridi has Rohit Sharma AND Virat Kohli. Castles them both. There is absolutely no doubt about it. Best in the WORLD! 🔥🔥🔥 #PAKvIND #INDvsPAK #AsiaCup #AsiaCup23 #ShaheenAfridi #ViratKohli #RohitSharma pic.twitter.com/wk4YUVCoig
— King Babar Azam Army (@kingbabararmy) September 2, 2023
రోహిత్, కోహ్లిలను ఔట్ చేశాక కూడా అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. 5 ఓవర్లు వేసిన అఫ్రిది 2 మెయిడిన్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 42/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (1), శ్రేయస్ అయ్యర్ (13) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment