డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్‌ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.
👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరే
బౌలర్ | టెస్టు వికెట్లు | వన్డే వికెట్లు | టీ20 వికెట్లు |
టిమ్ సౌథీ(న్యూజిలాండ్) | 389 | 221 | 164 |
షకీబ్ అల్‌హసన్(బంగ్లాదేశ్) | 246 | 317 | 149 |
లసిత్ మలింగ(శ్రీలంక) | 101 | 338 | 107 |
షాహీన్ అఫ్రిది(పాక్) | 116 | 112 | 100 |
Comments
Please login to add a commentAdd a comment