యాడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ తొలి టెస్టు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఆఖరి రోజు ఆసీస్‌కు మరో 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌కు మరో 7 వికెట్లు కావాలి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్‌గా ఉన్నారు.
స్టేడియంలో కన్పించిన షాహీన్
ఇక రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంకు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 33 ఓవర్‌లో షాహీన్ కెమరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బీజీగా ఉన్నాడు.
ఈ టోర్నీలో నాటింగ్‌హామ్‌షైర్ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్‌లో అఫ్రిది పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి టెస్టు జట్టుకు అఫ్రిది దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది.
చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్‌రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
Shaheenn Shah Afridi at Edgbaston, watching the 1st #ashes test day 4 pic.twitter.com/L1rNZBCJK8
— Team Shaheen Afridi (@TeamShaheenShah) June 19, 2023
Comments
Please login to add a commentAdd a comment