
సిడ్నీ: ‘యాషెస్’ సిరీస్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రవిస్ హెడ్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దాంతో సిడ్నీలో ఈనెల 5 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు అతను దూరమయ్యాడు. హెడ్ స్థానంలో ముగ్గురు ఆటగాళ్లు మిచెల్ మార్ష్, నిక్ మ్యాడిసన్, జోష్ ఇంగ్లిస్‌లను ఆసీస్ జట్టులోకి ఎంపిక చేశారు. కరోనా సోకడంతోనే ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కూడా సిడ్నీ టెస్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment