Steve Smith Stuck in Lift for 55 Minutes at Hotel, Marnus Labuschagne Try to Rescue Him - Sakshi
Sakshi News home page

55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్‌ స్మిత్‌

Published Fri, Dec 31 2021 4:45 PM | Last Updated on Fri, Dec 31 2021 5:23 PM

Steve Smith Stuck Lift For 55 Minutes Marnus Labuschagne Try To Rescue - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెల్‌బోర్న్‌ హోటల్‌ రూంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్మిత్‌ కూడా వారి సంబరాలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాలనుకున్నాడు. అయితే అనుకోకుండా తాను ఎక్కిన లిఫ్ట్‌ డోర్‌ ఇరుక్కుపోయింది.  దీంతో ఈ వైస్‌ కెప్టెన్‌ సాంకేతిక కారణాలతో 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో గడపాల్సి వచ్చింది. తన సహచర క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ స్మిత్‌ను బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి లిఫ్ట్‌ టెక్నిషియన్‌ వచ్చి స్మిత్‌ను క్షేమంగా బయటికి తీశాడు. ఈ మొత్తాన్ని స్మిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీవేలో చెప్పుకొచ్చాడు.  

చదవండి: Ashes Series 2021-22: ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌కు కరోనా..

'' లిఫ్ట్‌ ఎక్కిన తర్వాత నేను వెళ్లాల్సిన ఫ్లోర్‌ వచ్చినప్పటికి డోర్స్‌ ఓపెన్‌ కాలేదు. దీంతో బయట ఉన్న మార్నస్‌ లబుషేన్‌కు సమాచారం అందించాను. ఒకవైపు నేను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించగా.. అటువైపు లబుషేన్‌ కూడా ప్రయత్నించాడు.  మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో లిఫ్ట్‌ ఆపరేటర్‌ వచ్చి నన్ను కాపాడాడు. పోయిన ప్రాణం తిరిగివచ్చింది అనుకున్నా ఆ క్షణంలో.. ఇక 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో నరకం అనుభవించా. ఆ తర్వాత రూమ్‌లోకి వచ్చి రెస్ట్‌ తీసుకున్నా'' అంటూ రాసుకొచ్చాడు.

ఇక యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతుంది. వరుసగా మూడు టెస్టుల్లో భారీ విజయాలు అందుకున్న ఆసీస్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది.

చదవండి: Year End 2021: నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement