ICC WC 2023- Ban Vs Pak: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్ తరఫున అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బాబర్ ఆజం బృందం మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి ఓవర్లోనే వికెట్
ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ ఆరంభించిన పాక్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. మొదటి ఓవర్ ఐదో బంతికి బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్రిది సంధించిన బంతి వికెట్లను హిట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో తాంజిద్ వెనుదిరగతప్పలేదు.
సక్లెయిన్ ముస్తాన్ దీంతో పాకిస్తాన్‌కు తొలి వికెట్ దక్కగా.. షాహిన్ ఆఫ్రిది తన అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్లలో ఇంత వరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన పాక్ తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతంగా(మ్యాచ్‌ల పరంగా) వంద వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్లు వీరే..
►సందీప్ లమిచానే(నేపాల్)- 42 మ్యాచ్‌లలో
►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 44 మ్యాచ్‌లలో
►షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్)- 51 మ్యాచ్‌లలో
►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 52 మ్యాచ్‌లలో
►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 53 మ్యాచ్‌లలో.
చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే
Comments
Please login to add a commentAdd a comment