రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన బాబర్‌ ఆజం! ఫోటోలు వైరల్‌ | Shaheen Shah Afridi Ties Knot With Shahid Afridis Daughter Ansha Afridi In Karachi, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shaheen Afridi Marriage: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన బాబర్‌ ఆజం! ఫోటోలు వైరల్‌

Published Wed, Sep 20 2023 8:03 AM | Last Updated on Wed, Sep 20 2023 9:51 AM

Shaheen Afridi ties knot with Shahid Afridis daughter Ansha Afridi - Sakshi

పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది రెండో సారి పెళ్లి పీటలు ఎక్కాడు. మంగళవారం(సెప్టెంబర్‌19)న కరాచీలో తన భార్య అన్షా ఆఫ్రిదిని షాహీన్‌ మరోసారి నిఖా చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్‌- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే షాహీన్‌ బీజీ షెడ్యూల్‌ వల్ల అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరిద్దరి వివాహం జరిగింది.

దీంతో మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్‌-అన్షా భావించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిఖా మరోసారి జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో పాటు సహచర ఆటగాళ్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అన్షా ఎవరో కాదు పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది కూతురే.

ఇక రెండో సారి పెళ్లి చేసుకోవడంపై అఫ్రిది స్పందించాడు. "అల్లా మనల్ని  జంటగా సృష్టిస్తాడు. మరొక మనిషిని ప్రేమించేలా చేస్తాడు. ఇస్లాం ప్రకారం త్వరగా వివాహం చేసుకోండి. మీ భాగస్వామితో జీవితాన్ని ఆనందించండి.  హరామ్(డేటింగ్‌) సంబంధాలకు దూరంగా ఉండండి" అంటూ అఫ్రిది ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఇక షాహీన్‌ ఆసియాకప్‌-2023లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా అఫ్రిది నిలిచాడు. ఓవరాల్‌గా 5 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 10 వికెట్టు పడగొట్టాడు. మళ్లీ వన్డే ప్రపంచకప్‌తో షాహీన్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 6న హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
చదవండి#Nasir Hossain: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement