
షాహీన్ షా అఫ్రిది.. ఈ పాకిస్తాన్ బౌలర్ పేరు చేబితే భారత బ్యాటర్లు వణికి పోతున్నారు. ఆసియాకప్-2023లో మరోసారి అది రుజువైంది. వర్షం కారణంగా రద్దైన మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు లెప్ట్‌ఆర్మ్ పేసర్ చుక్కలు చూపించాడు. నాలుగు వికెట్లు పడగొట్టి అఫ్రిది మరోసారి తన మార్క్‌ను చూపించాడు.
అతడిని ఎదుర్కొవడానికి దాదాపు వారం రోజులు నెట్స్‌లో లెఫ్ట్‌ఆర్మ్ పేసర్‌తో ప్రాక్టీస్ చేశారు కూడా. అయినప్పటికీ అదే ఫలితం పునరావృతమైంది. వసీం అక్రమ్, మిచెల్ జాన్సెన్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్ వంటి వరల్డ్‌క్లాస్ లెప్ట్‌ఆర్మ్ పేసర్లకు చుక్కలు చూపించిన భారత్.. ఇప్పుడు 23 ఏళ్ల అఫ్రిదికి ఎందుకు భయపడుతోంది?
ఎటాకింగ్ లేదు..
షాహీన్ షా అఫ్రిది.. టీ20 అయినా, వన్డే అయినా పవర్‌ప్లేలో తన హాఫ్ ఓవర్ల కోటా పూర్తిచేయల్సిందే. కొత్త బంతితో అఫ్రిది అద్భుతాలు చేయగలడు. అదేవిధంగా తన పేస్‌తో బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో అదే స్వింగ్‌తో భారత టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా భారత బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఔట్ కావడానికి ప్రధాన కారణం ఎటాకింగ్ లేకపోవడమే.
బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఎక్కువగా ఢిపెన్స్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. దీంతో బంతి ఎడ్జ్‌తీసుకుని వికెట్లకు తాకడమో లేదా వికెట్ కీపర్ చేతికి వెళ్లడమో జరుగుతోంది. అదే బ్యాటర్లు మైండ్ సెట్‌మరి అతడిని ఎటాక్ చేస్తే పరిస్థితి మరోవిధంగా ఉంటుంది. ఎంత గొప్ప బౌలరైనా ఎటాక్ చేస్తే ఒత్తిడిలోకి వెళ్లక తప్పదు. కచ్చితంగా అదే పని భారత బ్యాటర్లు కూడా చేయాలి.
అప్పుడే అఫ్రిదిని ఎదుర్కొగలరు. బ్యాటర్లలో ఢిఫెన్సివ్ మైండ్ సెట్ ఉన్నంతవరకు అఫ్రిది తన అధిపత్యాన్ని కొనసాగిస్తునే ఉంటాడు. రాబోయే మ్యాచ్‌ల్లో అఫ్రిదిని భారత బ్యాటర్లు ఓ ఆట ఆడుకోవాలని కోరుకుందాం.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment