
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా దాయాది పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న సూపర్-4 సమరంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఓ పక్క కెప్టెన్ రోహిత్ శర్మ తన సహజశైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతుంటే, గిల్ మాత్రం పాక్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. ముఖ్యంగా గిల్.. పాక్ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిదిని టార్గెట్ చేశాడు.
అతను వేసిన ఇన్నింగ్స్ 3, 5 ఓవర్లలో ఏకంగా ఆరు బౌండరీలు బాదాడు. అంతటితో శాంతించని గిల్.. ఆతర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో నసీం షా బౌలింగ్‌లో రెండు బౌండరీలు, ఫహీమ్ అఫ్రాఫ్ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో మరో బౌండరీ బాది నలబైల్లోకి ప్రవేశించాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 61/0గా ఉంది. ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ మధ్యలో చాలా నిదానంగా ఆడి నసీం షా వేసిన 10వ ఓవర్‌లో వరుసగా 2 బౌండరీలు బాది తిరిగి టచ్‌లోకి వచ్చాడు.
ప్రస్తుతం గిల్ 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 41 పరుగులు.. రోహిత్ 30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వనించింది.
Comments
Please login to add a commentAdd a comment