ప్రేమదాస స్టేడియం (PC: PCB)
Asia Cup, 2023 Pakistan vs India Super 4:
05: 20: ఆసియా కప్-2023లో టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఎట్టకేలకు ఆట ఆరంభమైంది. వరుణుడు కరుణించడంతో ఇరు జట్లు మైదానంలో పోటీకి దిగాయి.
వరణుడి దోబూచులాట
03:26: కవర్లు ఇంకా తొలగించని సిబ్బంది
02:57: మైదానం మొత్తం పచ్చిగా ఉండటంతో మళ్లీ కవర్లు కప్పేసిన సిబ్బంది. దీంతో ఆట మొదలవుతుందన్న ఆతురతగా ఎదురుచూసిన అభిమానుల ఆనందం ఆవిరైపోయింది. మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
02:43: తగ్గుముఖం పట్టిన వాన.. కవర్లు తొలగించిన గ్రౌండ్ స్టాఫ్..
Covers are coming off...!!!
— Johns. (@CricCrazyJohns) September 11, 2023
- Great news from Colombo. pic.twitter.com/kaUfYLggp4
మ్యాచ్ జరిగేనా?
14:10 IST: టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. కొలంబోలో వర్షం అంతకంతకు పెరుగుతుందే తప్ప.. తగ్గుముఖం పట్టే దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు జట్లను కాదని చిరకాల ప్రత్యర్థుల పోరుకు రిజర్వ్ డే కేటాయించినా ఫలితం లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది.
కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీపడుతోంది. శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక. అయితే, ఇప్పటికే అక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా హొంబన్‌టోటకు వేదికను మారుస్తారనే వార్తలు వచ్చాయి.
విమర్శలు వచ్చినా
కానీ.. ఆసియా క్రికెట్ మండలి మాత్రం కొలంబోలో మ్యాచ్‌ల నిర్వహణకే మొగ్గుచూపింది. అదే విధంగా.. దాయాదులు భారత- పాక్ పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సెప్టెంబరు 10 నాటి మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా కేటాయించింది.
ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాలు, సూపర్-4లో ఎంట్రీ ఇచ్చిన గ్రూప్-బి జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ కోచ్‌ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం తమను సంప్రదించి, తాము సమ్మతం తెలిపిన తర్వాతే ఏసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ప్రకటన విడుదల చేశాయి. ఈ క్రమంలో కొలంబోలో ఆదివారం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు అనుకున్నట్లుగానే వరణుడు ఆటంకం కలిగించాడు.
రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలు
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుబ్‌మన్ గిల్(58) అర్ధ శతకాలతో శుభారంభం అందించారు. ఇక వర్షం కారణంగా 24.1 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి8, కేఎల్ రాహుల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. సోమవారం నాటి రిజర్వ్ డే కూడా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలోనూ వాన కురుస్తూ ఉండటంతో కవర్లు కప్పే ఉంచారు. మూడు గంటల సమయంలో ఆట ఆరంభం కావాల్సి ఉంది.
చదవండి: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే
#WATCH | Cloudy weather and light rainfall in Colombo, Sri Lanka ahead of India vs Pakistan match in Asia Cup 2023.
— ANI (@ANI) September 11, 2023
India is at 147/2 in 24.1 overs, the match will resume at 3pm. pic.twitter.com/ftY6PnI1UG
Comments
Please login to add a commentAdd a comment