విరాట్ కోహ్లి (PC: BCCI)
Asia Cup 2023 India Vs Pakistan: ‘‘కేఎల్ రాహుల్ లేడు కాబట్టి ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తే లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదురుతుంది. అయితే, పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను ఎదుర్కొనే క్రమంలో టీమిండియా అతడితో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉండకపోవచ్చు.
జట్టులో ఉన్న ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద కష్టమేమీకాదు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లను యథావిధిగా ఓపెనర్లుగా పంపాలి. మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించాలి.
కోహ్లి నాలుగో స్థానంలో రావాలి
అప్పుడు విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో.. శ్రేయస్ అయ్యర్ నంబర్ 5, హార్దిక్ పాండ్యా నంబర్ 6గా వస్తారు. ఆ తర్వాతి స్థానంలో రవీంద్ర జడేజా ఉంటాడు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు ముగ్గురు సీమర్లు ఉండాలి.
మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.. చాలా మంది మన బ్యాటింగ్‌లో డెప్త్ ఉంటే సరిపోతుంది అంటారు. నిజానికి బౌలింగ్‌లో డెప్త్ ఉంటే.. బ్యాటింగ్ డెప్త్‌తో పనిలేదు. కుల్దీప్, షమీ, సిరాజ్, బుమ్రాలతో పాటు జడేజా, హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్న కారణంగా మన బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా కనిపిస్తోంది.
కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఆసియా కప్-2023 ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరుకు భారత తుది జట్టును ఎంపిక చేసుకున్నాడు.
వన్‌డౌన్లో ఇషాన్ కిషన్ ఎందుకంటే
ఈ సందర్భంగా టాపార్డర్ కూర్పు గురించి కీలక సూచనలు చేశాడు. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో పంపి.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో కోహ్లిని ఆడించాలని సూచించాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ చాలని.. ముగ్గురు పేసర్లు జట్టులో ఉండే ప్రయోజనకరంగా ఉంటుందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
వాళ్లకు నో ఛాన్స్
తన జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు మంజ్రేకర్ చోటు ఇవ్వలేదు. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 2(శనివారం) ఆసియా వన్డే కప్ సందర్భంగా మ్యాచ్ జరుగనుంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నారు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు(Indian XI):
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
చదవండి: బుమ్రా కాదు! బాబర్‌కు చుక్కలు చూపించగల భారత బౌలర్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment