బాబర్‌ వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. మేము అతడిని ఫాలో అవుతాం: గిల్‌ | Shubman Gill Gives World Class Verdict On Babar Azam | Sakshi
Sakshi News home page

బాబర్‌ వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. మేము అతడిని ఫాలో అవుతాం: గిల్‌

Published Sun, Sep 10 2023 11:58 AM | Last Updated on Sun, Sep 10 2023 12:17 PM

Shubman Gill Gives World Class Verdict On Babar Azam - Sakshi

ఆసియాకప్‌-2023లో మరోసారి దయాదుల పోరుకు అంతా సిద్దమైంది. ఈ టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్‌  శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై గిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్‌ వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌ అని గిల్‌ కొనియాడాడు.

భారత జట్టు మొత్తం అతడిని మెచ్చుకుంటున్నదని గిల్‌ తెలిపాడు. అదే విధంగా భారత ఆటగాళ్లు బాబర్‌ లాంటి పాకిస్తాన్‌ బ్యాటర్ల ఆటను ఫాలో అవుతారా అని ఓ రిపోర్టర్‌ గిల్‌ను ప్రశ్నించాడు. అందుకు బదులుగా.. "అవును, కచ్చితంగా మేము అతడి ఆటను అనుసరిస్తాము.

ఒక ఆటగాడు అద్బుతంగా ఆడుతున్నప్పుడు.. వారి స్పెషాలిటీ ఏమిటో తెలుసుకోవాలని అందరూ భావిస్తారు. బాబర్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది.  అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. మేమంతా అతడిని అభిమానిస్తాము అని గిల్‌ సమాధనమిచ్చాడు. కాగా బాబర్‌ ఆసియాకప్‌ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆజం 168 పరుగులు చేశాడు.

అదే విధంగా పాకిస్తాన్‌ మ్యాచ్‌కు భారత వ్యూహాలు గురించి గిల్‌ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌ కోసం మాకు ఎటువంటి స్పెషల్‌ ప్లాన్స్‌ ఏమీ లేవు. ఆరంభం మంచిగా వచ్చి, ఆపై భారీ లక్ష్యా​న్ని ప్రత్యర్ధి జట్టు ముందు ఉంచాలి. పాకిస్తాన్‌ మేము ఆడిన ఆఖరి మ్యాచ్‌లో మా టాప్ ఆర్డర్ బాగా రాణించలేదు. అయినప్పటికీ మేము 260 పరుగులు చేశాడు. అదే మేము కొంచెం బాగా రాణించి వుంటే 310-320 పరుగులు చేసేవాళ్లం. ఈ రోజు అదే చేయడానికి ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు.

చదవండిAsia Cup 2023: అది నిజంగా సిగ్గుచేటు.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేపై టీమిండియా లెజెండ్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement