వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌పేసర్ షాహీన్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే టీ20ల్లో పాక్ కొత్త కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని వహాబ్ రియాజ్‌తో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అఫ్రిదికి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్. ఇక కివీస్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా దూరంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హ్యారీస్‌ను సెలక్టర్లు తప్పించారు. అదే విధంగా స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, హసీబుల్లా ఖాన్‌కు తొలి సారి పాక్ టీ20 జట్టులో చోటు దక్కింది.
న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, రౌఫ్, జమాన్ ఖాన్.
చదవండి: IPL 2024-SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. !?
Comments
Please login to add a commentAdd a comment