పాకిస్తాన్ టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ తప్పుకోవడంతో పాక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్ ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి అఫ్రిది, రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు.
.@iMRizwanPak has been appointed vice-captain of Pakistan's T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML
— Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024
కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాక్ న్యూజిలాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, డునెడిన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడిన పాక్.. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ మొత్తం పాక్ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు వరల్డ్‌కప్‌లోనూ పాక్ చెత్త ఆడి సెమీస్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20లకు పాక్ జట్టు: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment