ఆసియాకప్-2023లో భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్రిది పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. ఫీల్డ్‌లో మోకాలి నొప్పితో షాహీన్ బాధపడ్డాడు. అదే విధంగా ఎండ తీవ్రత కూడా కొంచెం ఎక్కవగా ఉండడంతో అఫ్రిది ఇబ్బంది పడ్డాడు.
అనంతరం ఫిజియో సలహా మెరకు మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అఫ్రిది 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే భారత్‌తో మ్యాచ్‌కు మరో 3 రోజుల సమయం ఉండడంతో అతడు కోలుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో విరుచుకుపడ్డారు.
343 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన నేపాల్.. 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (4/27) నేపాల్ పతనాన్ని శాశించగా.. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. తొలి కెప్టెన్‌గా! కోహ్లి రికార్డు బద్దలు
Shaheen Afridi felt some discomfort and left the field 🤐#PAKvsNEP #AsiaCup2023 pic.twitter.com/U7NI9Dt6kR
— Hamxa 🏏🇵🇰 (@hamxashahbax21) August 30, 2023
Comments
Please login to add a commentAdd a comment